విలువిద్య పోటీల విజయవంతానికి కృషి చేద్దాం
1 min read
విలువిద్య పోటీల విజయవంతానికి కృషి చేద్దాం
– విజయ పాల డెయిరీ ఛైర్మన్ ఎస్.వి. జగన్మోహన్ రెడ్డి
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 01, (కర్నూలు ప్రభ న్యూస్) :
కర్నూలు నగరంలో ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న 41వ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని విజయ పాల డైయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక విజయ పాల డెయిరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు విజయడెయిరీ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటి జిల్లాకు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 13 జిల్లాల నుంచి దాదాపు 350 మంది మేటి క్రీడాకారులు పోటీలకు హాజరవుతున్నట్లు వివరించారు. కార్యదర్శి నాగరత్నమయ్య మాట్లాడుతూ పోటీల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లన్నింటిని విజయడెయిరీ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.