కదిరి నియోజకవర్గ పరిశీలకులుగా పీజీ నరసింహులు యాదవ్
1 min read
కదిరి నియోజకవర్గ పరిశీలకులుగా పీజీ నరసింహులు యాదవ్
కర్నూలు టౌన్, మార్చి 01, (కర్నూలు ప్రభ న్యూస్) :
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ పరిశీలకులుగా పీజీ నరసింహులు యాదవ్ ను ఆపార్టీ అధిష్టానం నియమించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తిరిగి మరోసారి కదిరి నియోజకవర్గ పరిశీలకులుగా నియమించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. పార్టీ మరింత అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా నన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.