క్రీడలను ప్రోత్సహిస్తాం : టిజి భరత్
క్రీడలను ప్రోత్సహిస్తాం.. టిజి భరత్
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 01, (సీమకిరణం న్యూస్) :
క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు టిజి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని మౌర్య ఇన్ లో తిరుపతిలో విజయం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఆయన అభినందించారు. 5 జిల్లాల బ్యాడ్మింటన్ పోటీలు తిరుపతిలో జరగ్గా.. అండర్ 17, 19 పోటీల్లో ఫరియా అనే క్రీడాకారిణి మొదటి స్థానం కైవసం చేసుకుంది. అండర్ 15 పోటీల్లో చేతన తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందించారు. మరెన్నో విజయాలు సాధించి ఉన్నత స్థానాలకు చేరాలన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా తాను అండగా ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.