విద్యార్థుల సమస్యలపై పోరాడాలి : టిజి భరత్
1 min read
కర్నూలు విద్య, మార్చి 01, (కర్నూలు ప్రభ న్యూస్) :
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. మంగళవారం మౌర్య ఇన్ లో టిడిపి అనుబంధ విభాగమైన టి ఎన్ ఎస్ ఎఫ్ నియోజకవర్గ సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టిజి భరత్ హాజరయ్యారు. ముందుగా టీఎన్ఎస్ఎఫ్ కమిటీని భరత్ ప్రకటించారు. ఈ సంద ర్భంగా భరత్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు తమ బాధ్యతను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై పోరాడి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. విద్యార్థుల పక్షాన ముందుండి నిలబడాలన్నారు. కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజినేయులు, 46 వార్డ్ ఇంఛార్జి మధు, కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.