March 18, 2023

కేశవరెడ్డి లో ఆకట్టుకున్న ” సైన్స్ దినోత్సవం”

1 min read
KESAVA REDDY SCHOOL

కేశవరెడ్డి లో ఆకట్టుకున్న ” సైన్స్ దినోత్సవం”

కర్నూలు విద్య, ఫిబ్రవరి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :

నగరంలోని అన్ని కేశవ రెడ్డి పాఠశాలల్లో సోమవారం ఘనంగా నిర్వహించిన “సైన్స్ దినోత్సవం” ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈనెల 28న సి.వి.రామన్ జయంతిని పురస్కరించుకుని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు.ఇందులో భాగంలో విద్యార్థులు ప్రదర్శించిన “విద్యుత్ ప్రపంచం”, “సౌర రంగంలో భారత దేశ అభివృద్ధి”, “గురుత్వాకర్షణ శక్తి” “మునక్కాయ విత్తనాలతో నీటిని శుద్ధి పరచడం”, ” భూతాపం”, “చెట్లను నరికి వేయడం వల్ల నష్టాలు”,గుండే దాని పనితీరు”, వీటితో పాటు తెలుగు, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రాలలో ప్రదర్శించిన నమూనాలు “భువన విజయం” గణిత వైకుంఠ పాళీ”, “బాషా కేళి”, “పిరమిడ్”, “కరోనా నివారణ చర్యలు” “బ్లూ హైడ్రోజన్ ఫ్యూచర్ ఫ్యూయల్ “పార్లమెంటు” మొదలగునవి ప్రేక్షకులను ఆకర్షించాయి. “శ్రీ కృష్ణ దేవరాయలు, కవిత్రయం, తెలుగుతల్లి, కూచిపూడి నాట్యం, సోదెమ్మ, వేషధారణలతో సాగిన ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేశాయనడంలో అతిశయోక్తి లేదు. అనంతరం కేశవరెడ్డి పాఠశాలల వ్యవస్థాపక అధ్యక్షులు యన్. కేశవ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి సేవ చేసిన సి.వి.రామన్ ఇలాంటి గొప్ప వ్యక్తులను గుర్తుకు తెచ్చుకోవడం ఈనాడు ఎంతో అవసరమన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడల్లో తమ విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభను చాటే విధంగా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఎప్పుడు ముందుంటామని తెలిపారు.ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థులలో నూతన ఉత్తేజంతో పాటు విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుందని ఆ క్రమంలో ఈనాడు సాగిన ప్రదర్శన ఆద్యంతం అలరించిందన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!