September 28, 2023

ప్రైవేటు ట్రావెల్ బస్సులో 57 వజ్రాలు పట్టివేత

1 min read
KURNOOL POLICE

ప్రైవేటు ట్రావెల్ బస్సులో 57 వజ్రాలు పట్టివేత

అర కిలో పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం

కర్నూలు క్రైమ్, ఫిబ్రవరి 28, (కర్నూలు ప్రభ న్యూస్) :

ప్రైవేటు ట్రావెల్ బస్సులో 57 వజ్రాలు,అర కిలో పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నట్లు ఎస్ఈ బి సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ లు తెలిపారు. కర్నూలు పట్టణ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఎస్ఈబి చెక్ పోస్ట్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఎస్ఈ బి సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ , సిబ్బంది జరిపిన వాహన తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాదు నుండి బెంగ ళూరు కు వెళుతున్న ఏన్ ఏల్ 01 బి 2048 నిదా ట్రావెల్స్ అను ప్రవేటు ట్రావెల్ బస్సులో తనిఖీ చేయగా అందులో రాజస్థాన్ రాష్ట్రం, జున్జున్ పట్టణం కు చెందిన కపిల్ (23 సం”) అనే వ్యక్తి బ్యాగులో సుమారు 840 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు మరియు 57 వజ్రాలు గుర్తించారు.వీటి విలువ రూ.39.28 లక్షలు వుంటుందన్నారు. తాను హైదరాబాదు నుండి తన అన్న ఈ నగలు బెంగళూరులో కొన్ని నగల దుకా ణం లకు ఇచ్చి రమ్మనాడని, ఈనగల గురించి తన కేమీ తెలియదని,కేవలం ఈ నగల ప్యాకింగ్ పెట్టె బెంగలూరులో మరో వ్యక్తికు ఇచ్చి రమ్మనాడనీ తెలిపాడు.ఈ ఆభరణాలకు సంభందించి ఈ – వే బిల్లు మరియు ట్రావెలింగ్ ఓచర్, జి యస్ టి బిల్లులు లేవని చెప్పగా సదరు వ్యక్తిని , పట్టు బడిన బంగారు ఆభరణాలు,వజ్రాలను ను తగిన ఆధారాల ధృవీకరణ పత్రాల పరిశీలన కొరకు కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం పంపడమైనది. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ,ఖాజా, మహమ్మద్,కానిస్టేబుళ్లు మురళి,ఎస్ పి ఒ సుంకన్న, సుందర్,విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!