ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో 102 వ ఆత్మబంధు అంత్యక్రియలు
డోన్ టౌన్, సెప్టెంబర్ 27, (కర్నూలు ప్రభ న్యూస్):
కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర యాచించుకుంటూ తిరుగుతున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించగా వెల్దుర్తి పోలీసు వారు మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి అతని అంత్యక్రియలు మీరు నిర్వహించండని ద్రోణాచలం సేవా సమితి వారిని కోరగా స్పందించిన సేవా సైనికులు ఆ మృతదేహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో డోన్ హిందూ స్మశాన వాటికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ఖర్చు ప్రొద్దుటూరుకు చెందిన కీర్తిశేషులు వై నారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు చరణ్ తేజ రెడ్డి భరించారు. వైకుంఠ రథాన్ని రోటరీ క్లబ్ రాజయ్య గౌడ్ ఉచితంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచలం సేవా సైనికులు షాదిఖాన రాజా,షేర్షా సార్ గురుస్వామి,పానీపూరి మురళి,తాహెర్ బాషా మరియు వెల్దుర్తి పోలీసు లక్ష్మన్న, సమీర్ సార్ పాల్గొన్నారు .