జిజిహెచ్ లో ఎండోస్కోపీ యూనిట్ ప్రారంభం
కర్నూలు వైద్యం, సెప్టెంబర్ 27, (కర్నూలు ప్రభ న్యూస్) :
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈఎన్ టి విభాగంలో ఏర్పాటు చేసిన నూతన ఎండోస్కోపీ యూనిట్ ను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డా. సి.ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. అమెరికాలో నివసించే పూర్వ విద్యార్థులు డాక్టర్ కృష్ణారెడ్డి ,డాక్టర్ అరుణ దాదాపుగా 30 లక్షల విలువైన ఎక్విప్మెంట్స్ ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చారు. వీరు 1962 ,1963 బ్యాచ్‌లకు చెందినవారు. కర్నూలు మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించారు. విరాళంగా ఇచ్చిన అమెరికా డాక్టర్స్ ఇద్దరిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డా. సి.ప్రభాకర్ రెడ్డి అభినందించారు. అనంతరం ఎండోస్కోపీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ఎన్ టిహెచ్ వో డి డా. వీరకుమార్, డిప్యూటీ సిఎస్ఆర్ డా. వెంకట రమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివబాల,శివప్రసాద్‌రెడ్డి, డా. హరి కృష్ణ, పీజీలు,ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.