టీటీడీ లడ్డూ (Tirumala Laddu) వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Former Minister Vellampalli Srinivas) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు జరిగాయన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆ నెయ్యి ట్యాంకర్లు వాడలేదని కోర్టులో చెప్పారన్నారు. శ్రీవారి భక్తులు కల్తీ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆవేదనగా ఉన్నారన్నారు.