అరుదైన జన్యువాధితో బాధపడుతున్న మహిళ.. రక్తం గడ్డ కట్టడానికి కోటిన్నర ఇంజెక్షన్లు.
అరుదైన జన్యు వ్యాధితో బాధపడే నాగదుర్గకు మరో సమస్య వచ్చింది. దీంతో ఆమె గుంటూరు జిజిహెచ్ కు వచ్చింది. గత నెలలో ఆమెకు కుడివైపు అండాశయంలోని సిస్ట్ నుండి రక్తస్రావం కారడం ప్రారంభమైంది. దీంతో వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేసి సిస్ట్ తొలగించాలని నిర్ణయించారు. అయితే నాగదుర్గకు ఉన్న జన్యవ్యాధి కారణంగా రక్త స్రావం ఆగేందుకు పెద్ద ఎత్తున ఫ్యాక్టర్ 7 ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు.